Jan 17,2023 22:57

కేలండర్‌ను ఆవిష్కరిస్తున నాయకులు, అధికారులు

ప్రజాశక్తి -హుకుంపేట:ప్రజల గొంతు ప్రజాశక్తి దిన పత్రిక అని తెలుగుదేశం పార్టీ ఎస్‌టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర కొనియాడారు. మండలం కేంద్రంలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎస్‌టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర, ఐసీడీఎస్‌ శిశు సంక్షేమ శాఖ అధికారి సిహెచ్‌ మణిదేవి చేతులు మీదుగా ప్రజాశక్తి క్యాలండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం దొన్ను దొర మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొచ్చే పత్రిక ప్రజాశక్తి అని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై దీటైన కథనాలు ప్రచురించే ఏకైక తెలుగు దిన పత్రిక ప్రజాశక్తి అని ఆయన కొనియాడారు. తన దైన శైలిలో వాస్తవిక కధనాతో మంచి గుర్తింపు పొందిందన్నారు. ప్రతి ఏటా అందమైన క్యాలండర్‌ రూపొందించి ఆకర్షించే విధంగా ప్రజాశక్తి గుర్తింపు దక్కించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు బొడ్డా శ్యామ్‌, అరకు అసెంబ్లీ ఎస్‌ టి సెల్‌ కార్యదర్శి కొర్రా సంతోష్‌ కుమార్‌, ప్రజాశక్తి విలేకరి కొర్రా. ఆనంద్‌, ఆరమ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, జగన్‌ కుమార్‌, నాయకులు భీమన్నదొర, లచ్చన్నదొర, వెంకట్‌ జగన్‌, కర్రి బాబు, బుద్రన్న పాల్గొన్నారు.