Apr 23,2023 00:20
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపిడిఒ రాధాకృష్ణ

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని బాపట్ల ఎంపీడీవో రాధాకృష్ణ అన్నారు. శనివారం బాపట్ల మండలం ముత్తాయిపాలెం గ్రామ సచివాలయం రోడ్‌ వద్ద బాటసారుల కోసం చలివేంద్రంను ఆయన ప్రారంభించారు. పనుల నిమిత్తం వచ్చే వారికి, అలాగే బాటసారులకు ఉపయోగపడుతుంది అని, ఇందుకు చొరవ చూపి చలివేంద్రం ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ వారికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ శరత్‌బాబు, మండల సచివాలయ కన్వీనర్‌ వడ్డిముక్కల డేవిడ్‌, గ్రామ పంచాయతీ సెక్రటరీ కాసాని ఝాన్సీ లక్ష్మి, గ్రామ పెద్దలు, వాలంటీర్లు పాల్గొన్నారు.