ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం
ప్రజాశక్తి - పగిడ్యాల
గ్రామీణ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేశామని ఎంపీడీవో వెంకటరమణ, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం పగిడ్యాల బస్ స్టాండ్ లో చలివేంద్రను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పగిడ్యాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేందర్లు ఏర్పాటు చేశామని వారు అన్నారు. అధికంగా ఎండలు కావడంతో వాళ్ల గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వస్తుంటారని వారి దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్ డి పుల్లయ్య, ఎంఈఓ సుభాన్, కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శేఖర్, పల్లె సత్యనారాయణ రెడ్డి, పొన్నూరు రాజశేఖర్ రెడ్డి, దొంతుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










