Apr 20,2023 20:08

మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌

ప్రజాశక్తి - ఆస్పరి
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. గురువారం ఆస్పరి గ్రంథాలయంలో 'గ్రంథాలయ అభివృద్ధి - ప్రజల భాగస్వామ్యం' అనే అంశంపై గ్రంథాలయ అధికారి విశ్వనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రంథాలయాలకు అందాల్సిన సెస్సును పంచాయతీ పాలకవర్గాలు సక్రమంగా అందించాలని కోరారు. గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు ఉపయోగ పడే స్టడీ మెటీరియల్‌, పెద్దలకు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచామన్నారు. గ్రామంలోని పెద్దలు, యువకులు గ్రంథాలయ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు. విఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, ఆలూరు మాజీ జడ్‌పిటిసి రాంభీంనాయుడు, వైసిపి మండల కన్వీనర్‌ పెద్దయ్య, మండల మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, సిఇఒ అశోక్‌ పాల్గొన్నారు.