ప్రజల ఆశీస్సులే సిఎంకు రక్ష
ప్రజాశక్తి-ఉదయగిరి : ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి అందించే సంక్షేమ పథకాలతో చిరునవ్వులతో అందించే ఆశీస్సులే ఆయనకు రక్ష అని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని తిరుమలాపురం పంచాయతీలోని దుంపవారి పల్లి, ఎస్‌టికాలనీ, గుడినరవలో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమం ఎంపిటిసి అంబటి భాస్కర్ రెడ్డి సర్పంచ్ కొలుబోయిన కృష్ణ ఆధ్వర్యంలో తిరుమలాపురం ఎస్‌టి కాలనీ గడపగడప కార్యక్రమంలో పూలస్వాగతంతో ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని ఆయన ఆరా తీసి వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గడపగడపలలో మహిళలు సిమెంట్ రోడ్డు వీధి దీపాలు 50 సంవత్సరాల పెన్షన్ మంజూరైన వైఎస్‌ఆర్ గృహం స్థలం చూపించలేదని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం స్పందన అపూర్వ ఆదరణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్నారని మరల జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తహాశీల్దార్ జగదీష్ బాబు, ఎంపిడిఒ మల్లికార్జున, ఎపిఒ శ్రీనివాసులు, ఎపిఎం ఖాజారహంతుల్లాబాషా, మండల కన్వీనర్ అక్కి భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మూలే సుబ్బారెడ్డి సర్పంచ్‌లు కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి, గౌస్ మొహద్దీన్, భారతి, తిరుపతి, అంబటి సుబ్బారెడ్డి, బాలిబోయిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్, వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపిటిసిలు గొల్లపల్లి తిరుపతయ్య, సుభహాన్, మండల కోఆప్షన్ సుభాని, మాజీ సర్పంచ్ ఓబుల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చిన్నబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










