Sep 12,2023 20:40

సురక్ష కార్యక్రమంలో వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనుందని ఎంపిడిఒ కన్నం హేమలత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఎంపిడిఒ సమావేశ మందిరంలో జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రత్యేక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ ఈ నెల సురక్ష క్యాంపెయిన్‌ 15 నుంచి ప్రారంభ మవుతుందన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని గహాలను సందర్శించి ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. తహశీల్దార్‌ లావణ్య, ఇఒపిఆర్‌డి నారాయణరెడ్డి, వరిగొండ మెడికల్‌ ఆఫీసర్‌ నరసింహారావు, కోడూరు మెడికల్‌ ఆఫీసర్‌ భానుప్రియ, ఎంఇఒ జయరాం రెడ్డి ఉన్నారు.