
ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ
మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి , జడ్పిటిసి పుల్యాల దివ్య
ప్రజాశక్తి - పగిడ్యాల
ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టారని మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి , జడ్పిటిసి పుల్యాల దివ్య , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగిరెడ్డి గారి రమాదేవి, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న అన్నారు. సోమవారం పగిడ్యాల సచివాలయం 3 పరిధిలోని బీరవోలు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు అజాగ్రత్త వహించకూడదని తప్పనిసరిగా వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించార . ఎప్పుడైతే పరిశుభ్రత పాటించకుండా పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యాన బారిన పడి ఆసుపత్రి కాలవాల్సిందేనన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. గ్రామాల్లోని ప్రతి సచివాలయ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తూ మెరుగైన చికిత్స అవసరమైతే కర్నూలు వైద్యశాలకు రిపేర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈఓ సుభాన్, వైద్యాధికారి డాక్టర్ మోహన్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శేషమ్మ, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్రారెడ్డి, వైసిపి నాయకులు చిమ్మే బిచ్చన్న ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.