
మదనపల్లె అర్బన్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యాధిగ్రస్తులకు మెరుగైన ఆరోగ్యం దించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నిర్వహిస్తోందని జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు తెలిపారు. బుధవారం పట్టణంలోని రామాలయం వీధిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్, మండలంలోని పోతపోలు గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరాలను కలెక్టర్ గిరీషతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య సురక్ష క్యాంప్ శిబిరంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్, టోకెన్ జనరేషన్, బిపి, మధుమేహం, రక్త పరీక్షల విభాగం, ఆర్థోపెడిక్, ఆప్థాలజీ, జనరల్ చికిత్స చికిత్స విభాగాలు, డాక్టర్స్ వెయిటింగ్ రూమ్, మందుల స్టాక్ రూమ్, పౌష్టిక ఆహార శిబిరం తదితరాలను విస్తతంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరానికి వచ్చిన ప్రజలతో, డాక్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఆరోగ్య శిబిరం క్యాంపు నిర్వహిస్తున్న తేదీ, ఎక్కడ ఏర్పాటు చేశారు, టోకెన్ జనరేట్ చేసారా, మీకు ఎప్పుడు అందించారు, ఆరోగ్య మిత్ర, ఎఎన్‌ఎంలు ఇంటికి వచ్చారా, పరీక్షలు చేశారా, ప్రస్తుతం శిబిరానికి ఏ ఆరోగ్య సమస్యతో వచ్చారు, ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణ ఎలా ఉంది తదితర వివరాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడిక్, కంటి మరియు జనరల్ స్పెషలిస్ట్ డాక్టర్ల రూము వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యతో వచ్చిన వారికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని ఆరోగ్యశ్రీ కింద రెఫర్ చేస్తున్నారా, మదనపల్లి ఏరియాలో ఎన్ని పిహెచ్సీ, యూ హెచ్ సిలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్ లో ఎంత మంది ఏ ఏ విభాగాల డాక్టర్లు ఉన్నారు, ఆరోగ్యశ్రీ కింద శాస్త్ర చికిత్సలు చేయించుకొని వచ్చిన వారిని ఆరోగ్య ఆసరా క్రింద ఫాలోఅప్ ట్రీట్మెంట్ చేస్తున్నారా తదితర అంశాలపై డిఎంహెచ్‌ఒ, వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఆరోగ్యశ్రీని ఎంతో బలవపేతం చేసింది. ఆరోగ్యశ్రీ కింద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ, రిఫరల్ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు జరిగిన అనంతరం ఆరోగ్య మిత్ర, ఎఎన్‌ఎం, ఆశ, పిహెచ్సి డాక్టరు అందరూ సమన్వయంతో సదరు పేషెంట్‌కు పాలోఅప్ ట్రీట్మెంట్‌ను తప్పనిసరిగా అందజేయాలన్నారు. పాలోఅప్ చికిత్సకు కూడా ఆరోగ్యశ్రీలో ప్యాకేజెస్ ఉన్నాయని, ఇందుకు తగిన మార్గదర్శకాలు ఉన్నాయని ఈ విషయాలపై ఆరోగ్య మిత్ర ఎఎన్‌ఎం వాలంటీర్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తోందని, వీటిని మొక్కుబడి క్యాంపు లాగా భావించరాదని చెప్పారు. భవిష్యత్తులో ప్రజల హెల్త్ ఇండికేటర్స్ మెరుగుపడేలా ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. కలెక్టర్ గిరీష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య వివరాలను సేకరించడం జరిగిందని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరంలో వారికి అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చే బహత్తర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలందరు ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మనుజా, మురళి ఆర్‌డిఒ మురళి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కె.కొండయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ లక్ష్మి, మదనపల్లి స్పెషల్ ఆఫీసర్ ధనలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహశీల్దారు మహబూబ్ చాంద్, ఎంపిడిఒ విజయభాస్కర్, డాక్టర్లు, ఆరోగ్య మిత్రలు, ఎఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.