ప్రజాశక్తి - ఆదోని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను పోరాటాలకు సిద్ధం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు ఎమ్‌డి.అంజిబాబు కోరారు. సిపిఎం సభ్యుల రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా శనివారం సుందరయ్య భవన్‌లో రాజకీయ శిక్షణ తరగతులు పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌కు ధారాదత్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజలపై మోయాలని భారాలు వేస్తోందన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు లౌకిక విధానానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నా అడ్డుకట్ట వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, మహానంద రెడ్డి, తిప్పన్న, ముక్కన్న, నాగరాజు, వీరేష్, శ్రీనివాసులు, వెంకటేష్, మునెప్ప, అజీంఖాన్, రాజు, హనుమంతు, రాముడు, నాగేంద్ర, భరత్, ముతమ్మ, శంకరమ్మ, నర్సమ్మ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న అంజిబాబు










