ప్రజాస్వామ్యబద్దంగా వస్తారా? దాడులకే వస్తారా?
ప్రజాశక్తి-డోన్
'ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేస్తామంటే మేము సిద్ధం.. దాడులకే వస్తామంటే మీరు ఏ ప్లేస్‌కు రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం.' అని టిడిపి డోన్ నియోజకవర్గ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. బేతంచేర్ల టిడిపి కార్యాలయంపై వైసిపి నాయకులు దాడికి ప్రయత్నించిన సంఘటనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి , టిడిపి రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడారు. శుక్రవారం బేతంచెర్ల పట్టణంలో టిడిపి కార్యాలయం పై ఆర్థిక మంత్రి అనుచరులు దాడికి ప్రయత్నించడంతో డోన్ నియోజకవర్గ ప్రజలకు ఆర్థికమంత్రి నిజస్వరూపం బట్టబయలు అయిందని అన్నారు. బిసిల ఎదుగుదలను ఓర్వలేకనే ఆర్థిక మంత్రి కె.శ్రీనివాసులు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేశారనే ఉద్దేశ్యంతో కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రతిపాదించిన వారు బిసి, ఎస్‌సిలు అయినందున పోలీసులను అడ్డం పెట్టుకొని చిత్రహింసలు పెట్టి నామినేషన్ తిరస్కరణ అయ్యే విధంగా చేశారని అన్నారు. అయినప్పటికీ మా కౌన్సిలర్లను పోలీస్ స్టేషన్ నుండి తీసుకుపోవడానికి బేతంచెర్లకు రాగా పోలీస్ అధికారులు 10 నిమిషాలు తరువాత పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా తాము బేతంచెర్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండగా పోలీసు అధికారులు వచ్చి ''లా అండ్ అర్డర్ ప్రాబ్లంగా ఉందని'' మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుండి వెళ్ళామని అన్నారు. తాము లేని సమయంలో ఆర్థికమంత్రి అనుచరులు టిడిపి కార్యాలయం దగ్గరకు వచ్చి దాడులకు ప్రయత్నించడం సిగ్గు చేటని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేస్తామంటే మేము సిద్ధం, కానీ దాడులకే వస్తామంటే మీరు ఏ ప్లేస్‌కు రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ఎస్‌సి సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ , ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య , మాజీ ఎంపిపి దేవరబండ వెంకటనారాయణ గౌడ్ , నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున , నంద్యాల జిల్లా బిసి సెల్ కమిటీ నాయకులు జయ్యన్న యాదవ్ , డోన్ నియోజకవర్గ టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ఎర్రమల నాయుడు , నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు , డోన్ నియోజకవర్గ టిడిపి రైతు కమిటీ అధ్యక్షులు మల్లయ్య,అంబాపురం సర్పంచి శ్రీనివాసులు యాదవ్, డోన్ మండలం టిడిపి ఉపాధ్యక్షులు మిద్దపల్లె గోవిందు పాల్గొన్నారు.










