మాట్లాడుతున్న కుమార్
ప్రజాశక్తి-మాడుగుల:రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పివిజి కుమార్ తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమావేశం నేపథ్యంలో వైసిపి నేతలు అవాకులు, చవాకులుగా మాట్లాడటం సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి వైసిపి నేతలకు గుబులు పట్టుకుందని, ఈ నేపథ్యంలో టిడిపికి జనసేన తోడు అయితే వైసిపి పతనం పక్కా అని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పర్యటనలు అడ్డుకొనేందుకు జిఓ నంబర్ 1 ను ప్రభుత్వం తీసుకురావడం అన్యాయమని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా వైసిపి ప్రభుత్వం పాలన చేయడం దుర్మార్గమని ఆరోపించారు.










