Oct 02,2023 18:13

నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి -పొదలకూరు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ '' సత్యమేవ జయతే '' కార్యక్రమానికి మద్దతుగా పొదలకూరు టిడిపి మండల నాయకులు నల్ల చొక్కాలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు బయటకు వచ్చే వరకు నల్ల చొక్కాలతోనే వుంటామని, రాజ్యాంగాన్ని ,ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం అపహాస్యం చేస్తుందంటూ స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల టిడిపి నాయకులు టి. మస్తాన్‌ బాబు, బి. మల్లికార్జున్‌ నాయుడు, కోడూరు.పెంచల భాస్కర్‌ రెడ్డి,అక్కెంసుధాకర్‌ రెడ్డి మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. టిడిపి నాయకులు కోవూరు వెంకటేశ్వర్లు నాయుడు, షేక్‌ జమీర్‌ భాష, పులిపాటి వెంకటరత్నం నాయుడు, వెంకట్‌ రెడ్డి, సుబ్బానాయుడు, నారపు నాయుడు, బోగోలు భాస్కర్‌ రెడ్డి, పల్లారపు కష్ణ యాదవ్‌, దేవినేని శరత్‌, కలగట్ల సందీప్‌, మల్లినేని వెంకటేష్‌, గంటా మల్లికార్జున యాదవ్‌, అలుపూరు శ్రీనివాసులు, చిన్న, ఆదాల మురళి, సాదం గిరీష్‌, ఆశీర్వాదం, ప్రభాకర్‌ రెడ్డి, సురేష్‌ యాదవ్‌, పెంచల్‌ నాయుడు, రమేష్‌ నాయుడు, బ్రహ్మదేవి చంద్రశేఖర్‌, కొమ్మి చిరంజీవి నాయుడు, గాలి శ్రీనివాసులు ఉన్నారు.