ప్రజాశక్తి - గణపవరం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు. మంగళవారం కేశవరం, మల్లపురాజుపేట గ్రామాల్లో జరిగిన గడపగడపకూ ప్రభుత్వంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నక్కా సూర్య బంగారయ్య, ఎం.కామేశ్వరి, నాగేశ్వరరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ముదినేపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. ముదినేపల్లిలో మంగళవారం గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమం ఎంఎల్‌ఎ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి వైసిపి ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగనన్న పాలనలో సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపిపిలు సిహెచ్.సునీత, రాధా పాల్గొన్నారు.










