సోమందేపల్లి : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యేశంకరనారాయణ పేర్కొన్నారు.మండల కేంద్రంలోని నాలుగవ సచివాలయ పరిధిలోని స్నేహలత నగర్ ద్వారకామయి నగర్ లో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రజలతో అడిగి తెలుసుకున్నాడు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కి తెలియజేశారు. త్వరలో డ్రైనేజీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ నారాయణరెడ్డి, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, ఉప సర్పంచి వేణు, అధికారులు ,సచివాలయ ఉద్యోగులు, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










