మాట్లాడుతున్న వైసిపి నాయకులు రాజగోపాల్‌రెడ్డి
ప్రజాసంక్షేమమే ధ్యేయం
ప్రజాశక్తి-సీతారామపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమైనదని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయ కర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 9 సచివాలయాల పరిధిలో ఉన్న గ్రామ వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు అందరూ ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించడంలో స్థానిక నాయకులను సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించినా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల సూచనలను పాటిస్తూ పనిచేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం జగన్మోహన్ రెడ్డి కొత్త ఓరవడికను సష్టించి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందుతుందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందడమే గాక కొంతమేర నిరుద్యోగ సమస్య తీరిందన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దఢ సంకల్పమన్నారు. వాలంటీర్లపై నమ్మకంతో ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అందువల్ల ప్రజల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపిస్తే రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మేలు చేకూరడమే కాకుండా వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వాలంటీర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని వాలంటీర్లు నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతి వాలంటీరు తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న లబ్ధి వివరాలను వివరించి వైసిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించేలా పనిచేయాలన్నారు. మండలంలోని తొమ్మిది సచివాలయాల ద్వారా కోట్ల రూపాయల సంక్షేమ పథకాల లబ్ధి పేదలకు అందిందని ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్, సిమెంట్ రోడ్లు వంటి ఎన్నో అభివద్ధి పనులు చేపట్టినప్పటికీ ప్రతిపక్షాలు ఎల్లో మీడియా రాష్ట్ర అభివద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న 2024 ఎన్నికలలో రాష్ట్రంలో 175కి 175 సీట్లు గెలుస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు.కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ యువ నేత మేకపాటి అభినవ్ రెడ్డి, జెడ్‌పి కోఆప్షన్ సభ్యుడు గాజుల తాజుద్దీన్, వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, మారం రెడ్డి పల్లి సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి తిరుపతయ్య, సర్పంచ్ దుర్గయ్య యాదవ్, జెసిఎస్ కన్వీనర్ మాబయ్య, ఐకెపి ఏసి శేషారెడ్డి, ఎంపీడీఓ రంగ సుబ్బరాయుడు, తహశీల్దార్ షాజీయా బేగం, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.










