ప్రజాశక్తి - యలమంచిలి
వైసిపి ప్రభుత్వం నవరత్నాలు పేరుతో రూపొందించిన పథకాలకు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రే మూలమని వైసిపి పట్టణ అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్యదొర అన్నారు. సంకల్ప యాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో నూటికి నూరుశాతం నెవరవేర్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బోదెపు గోవిందరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గుప్తా, కౌన్సిలర్లు శానాపతి రాము, కొఠారు కొండబాబు, దూది నరసింహమూర్తి, సంతోష్, గొర్లి వెంకట్, మరిడేశ్వరరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
అనకాపల్లి వైసిపి కార్యాలయంలో...
అనకాపల్లి : స్థానిక రింగ్ రోడ్‌లోని వైసిపి కార్యాలయంలో ఆదివారం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్, కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి ఆదివారం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, పార్టీ నాయకులు దాడి నారాయణరావు, సకల గోవింద, కోరుకొండ రాఘవ, రమేష్ గుప్తా పాల్గొన్నారు.
జివిఎంసి 80వ వైసిపి కార్యాలయంలో వైసిపి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కరరావుతో కలసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల కృష్ణ అప్పారావు, దాడి ఈశ్వరరావు, కర్రి గణేష్, భీశెట్టి కృష్ణ అప్పారావు, కర్రి అప్పాజీ, బిఎస్‌కె.నాయుడు, పొలిమేర శివ అప్పారావు పాల్గొన్నారు.
మాడుగులలో...
మాడుగుల : సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం మాడుగులలో వైసిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. బస్‌స్టాండ్‌లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపిపి పెదబాబు, సర్పంచ్ ఎడ్ల కళావతి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఎంపిటిసి పొలిమెర విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యురాలు ఉన్నిష, కుక్కర్ మహేశ్వరి పాల్గొన్నారు










