Apr 21,2023 23:00

సిపిఎం ఆందోళన
ప్రజాశక్తి - టి.నరసాపురం

             మండల కేంద్రమైన టి.నరసాపురం హైస్కూల్‌ సెంటర్‌లో ఆర్‌అండ్‌బి స్థలంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆ చలివేంద్రం పందిరిని పంచాయతీ సిబ్బంది పడవేసి ఎర్రజెండాను కింద పడేశారు. దీంతో ఆగ్రహించిన సిపిఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఎర్రజెండా పడేసిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రం ధ్వంసం చేయడం అన్యాయమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో సిపిఎం మండల నాయకులు తుమ్మల సత్యనారాయణ, అనుమోలు మురళి, పండు వీర భద్రుడు, మడకం కుమారి పాల్గొన్నారు.