Oct 13,2023 01:00

ప్రజాశక్తి - వేటపాలెం
ప్రజా సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకే గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ అన్నారు. ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. మండలంలోని పందిళ్లపల్లిలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ ఫలాలు సిఎం జగన్‌ అందించారని చెప్పారు. ఇంటింటికి సంక్షేమ క్యాలెండర్ కరపత్రాలు అందించారు.  కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసిపి మండలం అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్ కందేటి రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, ఆర్‌బికె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, చీరాల ఆర్‌బికె చైర్మన్ కావూరి రమణరెడ్డి, రొండా భరత్, ఆవుల అశోక్, రాఘవ, పృధ్వీ చంద్ర మోహన్, చెరుకూరి బల్నాయడు, పిట్టు హనుమంతురెడ్డి, గుత్తి మలయ్య, సజ్జ చంద్రశేఖర్, లేళ్ల శ్రీధర్, కట్టా జార్జ్ స్యామేల్, కర్ణ లక్షరావు, పిన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, దంతం మంతు, అందే కృష్ణ, కంచి సాంబిరెడ్డి, యారసు శ్యామ్, నంగు రామిరెడ్డి, మదుల్లూరి సీత మహాలక్ష్మి, వేటగిరి సంజీవరావు, కట్టా గంగయ్య, కజ్జి, కేబుల్ కృష్ణ, పులి హరికృష్ణ, బండారు జ్వాల, వాసిమల్ల బ్రదర్స్, ఎపిఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.