
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడైనా ప్రజాసమస్యలపై మాట్లాడారా అని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దీపిక, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ ప్రశ్నించారు. మంగళవారం వైసిపి స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ ఆయన బావను అరెస్టు చేస్తే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారని ఎప్పుడైనా నియోజకవర్గ సమస్యలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారా అని ప్రశ్నించారు. కనీసం శాసన సభ సమావేశ సమయంలో అయిన నోరు విప్పారా అని అన్నారు. ఆయన బావ చంద్రబాబు నాయుడును స్కీల్ స్కాంలో అరెస్టు చేస్తే నోరుందని కదా అని బరి తెగించి మాట్లాడితే చూస్తు ఉండరని అన్నారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియోజక వర్గ ప్రజలు రెండవ సారి బాలకృష్ణను ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం, పార్టీ గురించి నోరు జారితే రాష్ట్రంలో ఎక్కడిక్కడ అడ్డుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చిన్న పాటి వర్షానికే పట్టణంలోని కొన్ని ప్రాంతాలు మునిగి పోవడమే బాలకృష్ణ చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. మానవతా దృక్పథంతో, పారదర్శకంగా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత బాలకృష్ణకు లేదన్నారు. ఈ సమావేశంలో వేణురెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మేన్ జబివుల్లా, కౌన్సిలర్లు షాజియా, రోషన్, రామచంద్ర, మాజీ ముత్వల్లీ కలీం తదితరులు పాల్గొన్నారు.