Jan 01,2023 22:43

ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

నేటి పోటీ ప్రపంచంలో సైతం ప్రజాశక్తి వార్తలు, కథనాల రూపంలోనే కాకుండా ప్రత్యేక సంచికల రూపంలో సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసేందుకు ముందుంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ రాజగోపాల్‌ అన్నారు. పట్టణంలోని ఉదయభాను, శ్రీరామ్‌ రాజగోపాల్‌ స్వగహాల నందు వేరువేరుగా 2023 ప్రజాశక్తి కేలండర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎలికి తీసి అధికారులకు, నాయకులకు చేరువేయటంలో నిజాలను నిగ్గు తీయటంలో ఆ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కథనాల రూపంలో చేరవేయటంలో ప్రజాశక్తి ముందుం టుందన్నారు. 2023 క్యాలెండర్‌ రంగురంగుల మల్టీకలర్‌లో తీసుకురావడం అభినందయకుమని, ప్రజాశక్తి పేపర్‌ ను ప్రజలు, అధికారులు, నాయకులు ఆదరించాలన్నారు. ప్రజాశక్తి కార్మిక, కర్షక పక్షపాత పత్రికని, నేటి పోటీ ప్రపంచంలో మిగిలిన పత్రికలతో పోటీగా వార్తలు, ప్రత్యేక కథనాలు, ప్రత్యేక సంచికలు తీసుకురావడంలో ప్రజాశక్తి తనకంటూ ముద్ర వేసుకుం దన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రజాశక్తి విలేఖరి జుజ్జువరపు వెంకటరావు, నందిగామ డివిజన్‌ ఇంచార్జ్‌ ఎం శ్రీనివాసరావు, ఎన్‌ఎస్పి సైదా తదితరులు పాల్గొన్నారు.