అనంతపురం కలెక్టరేట్ : వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దష్టి పెట్టాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు, దిశ ఛైర్మన్ తలారి రంగయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణంలోని డిపిఆర్సి సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జిల్లా అభివద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని పార్లమెంట్ సభ్యులు, దిశ ఛైర్మన్ తలారి రంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు అధికారులు కషి చేయాలన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులను అభివద్ధి చేయాలన్నారు. ఎంపీ లాండ్స్ కింద మంజూరైన పనులను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, పనులు చేపట్టేందుకు అవసరమైన డబ్బులు అందుబాటులో ఉన్నాయనియ తెలిపారు. కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు చేరుకోవాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేయించాలన్నారు. ఆయా పథకాల కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు చూడాలని, లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ జిల్లాలో మాతా, శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం, సిపిఒ ప్రశాంత్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్ర, పీఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇషాన్ బాషా, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డా||ఈబి.దేవి పాల్గొన్నారు.










