ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రజాశక్తి పాత్ర ప్రశంసనీయం
క్యాలెండర్ ఆవిష్కరణలో ఎంఎల్‌ఎ బాలరాజు
బుట్టాయగూడెం:ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ప్రజాశక్తి తనదైన శైలిలో పని చేస్తుందని పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు అన్నా రు. ప్రజాశక్తి-2023 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సమస్యలను ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాశక్తి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాశక్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎఎంసి ఛైర్మన్ కరాటం సీతాదేవి, ఎంపిపి కారం శాంతి, జెడ్‌పిటిసి సభ్యులు మొడియం రామతులసి, మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ, స్థానిక సర్పంచి తెల్లం వెంకాయమ్మ, ఎస్‌ఐ జయబాబు, ప్రజాశక్తి విలేకరి జి.మధుబాబు, కెవిపిఎస్ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్, ఎంపిటిసిలు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు.










