ప్రజాశక్తి - టి.నరసాపురం
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో వైసిపి పరిపాలన సాగుతోందని పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని అల్లంచర్ల, రాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో గురువారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారునికి అందజేస్తున్నామన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, ఎంపిపి డి.లక్ష్మి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ శ్రీను రాజు, ఎంపిటిసి బొడ్డపాటి రాంబాబు, వాసిరెడ్డి మధు, బోళ్లా రంగారావు, ములకయ్య, కె.సత్తిపండు, బొల్లారపు రాజు పాల్గొన్నారు.










