
ప్రజాశక్తి- తణుకు
ప్రజాశక్తి తణుకు రూరల్ రిపోర్టర్ చిల్ల రాజశేఖర్ తల్లి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. చిల్ల సౌదామణి(70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. సౌదామణి భర్త సాల్మన్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజశేఖర్ ప్రజాశక్తి విలేకరిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు సుధాకర్ హైదరాబాదులో ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. రాజశేఖర్ భార్య సుభాషిణి తణుకులో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సౌదామని సొంత ఊరు భీమవరంలో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. సౌదామణి మృతి పట్ల ప్రజాశక్తి ఎడిషన్ మేనేజర్ డి.శ్రీనివాస్, జిల్లా డెస్క్ ఇన్‌ఛార్జి విఎస్‌ఎస్‌వి.ప్రసాద్, స్టాఫ్ రిపోర్టర్ పి.గంగరాజు, జిల్లా ఎడివిటి ఇన్‌ఛార్జి పి.నారాయణరాజు, సర్క్యులేషన్ ఇన్‌ఛార్జి వై.సీతారాం, ఎడివిటి డివిజన్ ఇన్‌ఛార్జి కె.బాలాజీ తదితరులు సంతాపం తెలిపారు.