కంచికచర్లలో అనధికార లే అవుట్‌ను పరిశీలిస్తున్న రెవిన్యూ అధికారులు....
ప్రజాశక్తి - కంచికచర్ల : ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్‌లు వేస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. కంచికచర్లలో జాతీయ రహదారి పక్కన అనుమతులు లేకుండా వేస్తున్న లే అవుట్‌లపై సోమవారం ప్రజాశక్తి జిల్లా ఎడిషన్‌లో నిబంధనలకు తూట్లు పేరుతో కథనం వెలువడింది. దీనికి రెవిన్యూ అధికారులు స్పందించారు. స్థానిక తహశీల్దార్ పి.శంకర బాబు ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ షేక్ నాగులు మీరా, విఆర్‌ఒ శిరీష అనధికార లేఅవుట్‌లను పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన అనధికార లే అవుట్ లో జరుగుతున్న పనులు నిలిపి వేయించారు. అనుచరులు లేకుండా లే అవుట్ వేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.










