Aug 01,2022 23:11

ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తు ్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -తగరపువలస      ప్రజాశక్తి తెలుగు దినపత్రిక 42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను చిట్టివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పొట్నూరు మురళీమోహన్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, కష్టజీవులు ఇలా ప్రతి ఒక్కరి సమస్యలను ప్రతిబింబించేలా వార్తలు, వ్యాసాలు రాస్తున్న ప్రజాశక్తి దినపత్రిక 41 ఏళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుని, 42వ ఏడాదిలో అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. రాబోయే కాలంలో ప్రజాశక్తి మరింతగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.