ప్రజాశక్తి-విజయనగరం కోట : బాలల దినోత్సవం నేపథ్యంలో ప్రజాశక్తి చిరుమువ్వల పేరిట ముద్రించిన స్నేహ ప్రత్యేక సంచికను శనివారం పలుచోట్ల ఆవిష్కరించారు. నగరంలోని గురజాడ స్కూలులో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, జెవివి జాతీయ అధ్యక్షులు ఎంవిఆర్ కృష్ణాజి తదితరులు ఆవిష్కరించారు. అయినాడ జంక్షన్లోగల వాణి సంతోష్ పాఠశాలలో కరస్పాండెంట్ రామకృష్ణ, ఉపాధ్యాయులు ఈ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యుదయ భావాలుగల ప్రజాశక్తి దినపత్రిక చిన్నారులను ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కథలు, కవితలు, బొమ్మలు సేకరించి పుస్తక రూపంలో తీసుకు రావడం అభినందనీయ మని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించడంలో ప్రజాశక్తి ముందుంటుం దన్నారు. శాస్త్రీయ ఆలోచనను విద్యార్థులు పెంపొందించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాశక్తి జిల్లా కన్వీనర్ కె.రమేష్ నాయుడు, సిహెచ్ రాము, డిఒ కె. శ్రీనివాసరావు, ఎం.శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.