Mar 08,2023 23:49

రక్తదానం చేస్తున్న ప్రజాశక్తి సిబ్బంది

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ 25వ వార్షికోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సౌజన్యంతో ప్రజాశక్తి సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విజయనగరం మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పిఎ.రమణి హాజరై మాట్లాడారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రక్తదానం ఎవరు, ఎప్పుడు చేయవచ్చు, సేకరించిన రక్తాన్ని ఏ విధంగా విభజిస్తారు, ఉపయోగిస్తారు అన్న విషయాలను వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషిని వివరించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు ప్రజాశక్తి ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ శివనాగేంద్రరెడ్డి, ప్రజారోగ్య వేదిక నాయకులు టి.కామేశ్వరరావు, ప్రజాశక్తి ఎడిషన్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, బ్యూరో చీఫ్‌ మధుసూధనరావు, ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు