జానకి మృతదేహానికి నివాళి
ప్రజాశక్తి -గంగవరం: మండలం లోని కలగటూరు గ్రామానికి చెందిన ఆశావర్కర్ జానకి(39) గత కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధ పడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న గంగవరం మండల సీఐటియు యూనియన్ ఆశా వర్కర్స్ తో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులరాజు ఆమె భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మతురాలికి ఓ కుమారుడు, ఓ కుమార్తె వున్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఓబులరాజు కోరారు.
మండలంలోని కలగటూరు గ్రామ సచివాలయంలో పనిచేయుచున్న ఆశ వర్కర్ జానకి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండి శుక్రవారం మతిచెందడంతో నియోజక వర్గం సిఐటి యు నాయకులు గిరిధర్ గుప్తా, మండల ఆశ వర్కర్ల అధ్యక్షురాలు సావిత్రమ్మ ,మంగమ్మ, బుజ్జి, శివమ్మ ,కష్ణవేణి మొదలగువారు గ్రామానికి చేరుకొని నివాళులర్పించారు.










