Aug 26,2023 22:56

కిట్టు మిషన్లను పంపిణీ చేస్తున్న సుబ్బారావు

* శ్రీకూర్మం, అరసవల్లి దేవస్థానాల్లో
* శాశ్వత మంచినీటి పథకాలకు ఆమోదం
* రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ 3020 గవర్నర్‌ సుబ్బారావు
* మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
ప్రజాశక్తి- శ్రీకాకుళం : 
నిరంతరం పేదల సేవలోనే రోటరీ సంస్థ ఉంటుందని రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ 3020 గవర్నర్‌ సుబ్బారావు అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని రోటరీ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ ప్రాంగణంలో ఏర్పాటైన కార్యక్రమంలో 20 మందికి కుట్టు మిషన్లు, ట్రైనింగ్‌ పొందిన 70 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోటరీ సెంట్రల్‌ అధ్యక్షులు యెరుకోల మురళీమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ క్లబ్‌ అధ్యక్షులు యెరుకోల మురళీమోహనరావు కోరిక మేరకు ప్రసిద్ధ దేవాలయాలైన శ్రీకూర్మం, అరసవల్లి దేవస్థానాల్లో శాశ్వత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం సెంట్రల్‌ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది యెరుకోల మురళీమోహనరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ రోటరీ అని తెలిపారు. తాను అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నెల రోజుల్లోనే శ్రీకాకుళం నగరంలోని ఏఎస్‌ఎన్‌ కాలనీలో పర్యావరణ పరిరక్షణ కాంక్షిస్తూ 500 మొక్కలు నాటామన్నారు. విశాఖ బీ కాలనీలో షిరిడి సాయిబాబా మందిరం వద్ద పిల్లలు, మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అందుకుగాను రోటరీ సంస్థ తనకు ప్రథమ పురస్కారాన్ని అందజేసిందని వివరించారు. వెనకబడిన జిల్లాలో ఉన్న తమ ప్రాంతానికి రోటరీ సంస్థ సహకారం అందించాలని కోరారు. అనంతరం గవర్నర్‌ సుబ్బారావు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సీనియర్‌ సభ్యులు డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు, వరదా కొండబాబు, క్లబ్‌ అసిస్టెంట్‌ గవర్నర్‌ కె టి నాయుడు, కే నాగేశ్వరరావు, సెక్రటరీ కేఎన్‌ వి దుర్గారావు, సభ్యులు కోరాడ హరగోపాల్‌, వైకుంఠరావు, ఎన్‌ నరసింహమూర్తి, టి. వాసుదేవరావు పి. వాసుదేవరావు, ఐకే రావు, ఎంఆర్క్‌ దాస్‌, ఊన్న సంతోష్‌, కె . నాగేశ్వరరావు, శోభా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.