Dec 07,2022 00:03

మాట్లాడుతున్న వైద్యాధికారి

ప్రజాశక్తి-గొలుగొండ:ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలని గొలుగొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్యామ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లకు, హెల్త్‌ సిబ్బంది, వివిధ గ్రామాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రోలుగుంట:ప్రజల ఆరోగ్య వివరాలను ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని బుచ్చెంపేట పిహెచ్‌సి వైద్యాధికారి సునీత పేర్కొన్నారు. బుధవారం పిహెచ్‌సిలో ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వివరించారు. ఎల్‌సిడి, సిడి కోసం ఎన్‌ఎల్‌ఇపి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొంది తిరిగి వచ్చిన రోగుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆశలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.