ప్రజాశక్తి - కదిరి అర్బన్ : ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి. సిద్ధారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోనిఎన్జీవో కాలనీ వార్డు సచివాలయం పరిధిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద సోమవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదవారి పాలిట వరమన్నారు. ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ నజీమున్నీసా సాదిక్‌తో పాటు వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపిపి, జెడ్పీటీసీతో పాటు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.