
ప్రజాశక్తి - కదిరి అర్బన్ : ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్ అరుణ్‌బాబు అన్నారు. మండలంలోని మొటుకుపల్లి సచివాలయం పరిధిలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్యసురక్ష వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కృష్ణారెడ్డి, ఎంపిడిఒ అంజినప్ప, మండల ప్రత్యేక అధికారి సుబ్బా రావు , తహశీల్దార్ సునీత ,మున్సిపల్ కమిషనర్ శ్రీ.హరిబాబు తదితర అధికారులతో పాటు మొటుకుపల్లి సర్పంచి రూప నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: మండలంలోని పులేరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని జీనవాండ్లపల్లి, మరెడ్డిపల్లి, కొత్త బోయినపల్లి గ్రామాలకు చెందిన పలువురు ఈ వైద్య శిబిరంలో వైద్యసేవలు పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ప్రభాకర్ రావు, వెంకటరమణ పల్లి పంచాయతీ సర్పంచి అశ్వత్ రెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : చిలమత్తూరు సచివాలయం- 3 సంజీవరాయునిపల్లి గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచి సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపిపి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యులు నికేష్ హర్షమిత్ర వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాఘవేంద్ర రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, వైసిపి మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : మండలంలోని మర్తాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజేంద్ర, నాగేంద్ర నాయక్, జెడ్పీటీసీ తిరుమల సేవే నాయక్, వైద్య ,సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలోని 11వ వార్డు మోడల్ కాలనీలో వార్డ్ కౌన్సిలర్ అంజలి అధ్యక్షతన లక్ష్మీపురం అర్బన్ హెల్త్ సెంటర్ లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ హారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేశారు. ఈ కార్యక్రమంలో రవితేజారెడ్డి, సచివాలయం అడ్మిన్ లోకేష్, ఎఎన్‌ఎం ఎర్రమ్మ, సెక్రెటరీస్ వరలక్ష్మి, రమేష్, శిల్పా, సాయి, ప్రభావతి, అంబిక, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.