Oct 08,2023 23:29

ప్రజాశక్తి-రాజోలు
రోటరీ నూతన ప్రణాళికలో భాగంగా ప్రజారోగ్యంపై దృష్టి సారించిందని రోటరీ జిల్లా గవర్నర్‌ రావూరి సుబ్బారావుఅన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన రాజోలు రోటరీ క్లబ్‌ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతికి, పోలియో నివారణకు రోటరీ క్లబ్‌ స్థానికంగానూ జాతీయంగానూ అంతర్జాతీయంగానూ చేస్తున్న సేవల గురించి వివరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్‌ క్యాంపులు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. బాలికల వసతి గృహాలు సందర్శించి వారికి దుప్పట్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీధుల్లో ఉన్న మహిళా బెగ్గర్స్‌ ను గుర్తించి వారికి తోపుడు బండ్లు, గొడుగులు పంపిణీ చేస్తామని అన్నారు. అనంతరం రాజోలు రోటరీ అధ్యక్షుడు ఏడిద కవీంద్ర మాట్లాడుతూ లక్ష్యాలను సాధించడంలో రాజోలు క్లబ్‌ గణనీయంగా పనిచేస్తుందని అన్నారు. రాజోలు రోటరీ తరుపున రోటరీ ఫౌండేషన్‌కు 150 డాలర్ల విరాళాన్ని సభ్యులు డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌కు అందించారు. అలాగే రాజోలు డిగ్రీ కాలేజీకి రెండు కంప్యూటర్లను క్లబ్‌ బహూకరివచారు. మొగలి కుదురు వృద్ధాశ్రమానికి రొటీరియన్‌ దార్ల పెదబాబు రూ.6 వేల సహాయం అందించగా, సీనియర్‌ రోటరియన్‌ డాక్టర్‌ బసవ వరహాలు వద్ధాశ్రమంలోని వద్ధ మహిళలకు చీరలను, పిల్లలకు నోటు పుస్తకాలు పెన్నులు, వేమన శతక పుస్తకాలు అందించారు. అనంతరం రోటరీ సభ్యులు డిస్టిక్‌ గవర్నర్‌ రావూరి సుబ్బారావు ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిట్టినీటి లక్ష్మణరావు, అసిస్టెంట్‌ గవర్నర్‌ నల్లి శివకుమార్‌, కిషోర్‌, రామకృష్ణ, తిరుమలరావు, సోమరాజు, అడబాల నాని, వెంకటరమణ, నామన షణ్ముఖ, మహ్మద్‌ కిశ్వర్‌, కసుకుర్తి రామకష్ణ, ఐ.సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.