Oct 10,2023 20:32

ప్రజాశక్తి - మొగల్తూరు
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మంగళవారం కెపి.పాలెంసౌత్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమాల్లో సర్పంచులు అందే వెంకటలక్ష్మి, కడలి సోంబాబు, ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఉండి : జగనన్న ఆరోగ్య సురక్షతోనే ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నెరవేరుతుందని ఉండి మండల పరిషత్‌ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. వాండ్రం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాసరి వెంకటకృష్ణ, ఎంపిటిసి పెన్మెత్స ఆంజనేయరాజు, స్టేట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గులిపల్లి అచ్చారావు, నాయకులు పాల్గొన్నారు.
వీరవాసరం: ఇంటి వద్దకే పథకాలతో పాటు గ్రామం ముంగిటకే వైద్యం అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని భీమవరం ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు అన్నారు. మత్స్యపురిపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంగళవారం కోటిపల్లి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు వైద్యం ఖరీదైన నేపథ్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్య సమస్యలను గుర్తించి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచి కురెళ్ల వెంకట పద్మావతి, వైస్‌ ఎంపిపి చిలకపాటి ప్రకాశం, వైసిపి నాయకులు కర్రా ప్రకాషరావు, త్రిమూర్తులు పాల్గొన్నారు.
పెనుమంట్ర:జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సేవలు సక్రమంగా అందజేస్తే సామాన్యులు ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లరని డిఆర్‌ఒ కె.కృష్ణవేణి తెలిపారు. ఓడూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒపిలు ఎక్కువగా వైద్య సిబ్బంది దగ్గర ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి బుర్రా రవికుమార్‌, మండల పరిషత్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ రామస్వామి, ఎంపిడిఒ పి.పద్మజ, తహశీల్దార్‌ దండు అశోక్‌వర్మ, ఎంఇఒ ఉంగరాల నాగేశ్వరరావు, ఉప సర్పంచి ఇందుకూరి సాయి సుబ్బరాజు పాల్గొన్నారు.
కాళ్ల : ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గ్రామ సర్పంచి సాగిరాజు సుబ్బరాజు అన్నారు. మాలవానితిప్పలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సిహెచ్‌ హేమలత, మంతెన రంగరాజు పాల్గొన్నారు.
పాలకోడేరు : ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వం ఉద్దేశమని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. గొల్లలకోడేరులో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు), ఉండి ఎఎంసి ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు, వైస్‌ ఛైర్మన్‌ చేకూరి రాజా నరేంద్రకుమార్‌తో కలిసి పివిఎల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్య ఆరోగ్యశాఖ అంగన్‌వాడీలు ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పివిఎల్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమంతో పాటు ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి జగనన్న ఆరోగ్య సురక్ష ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ రాజా నరేంద్ర కుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కుక్కల లక్ష్మి, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి రాజు వంశీకృష్ణంరాజు, బొల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
ఆచంట : పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. వల్లూరు పంచాయతీ పరిధి మట్టపర్తివారిపాలెం కళ్యాణ మండపంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు జితేంద్ర, రామాంజనేయులు వేణుబాబు సత్యవతి పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండ - 1 మెయిన్‌ గ్రామ సచివాలయానికి సంబంధించి టిటిడి కళ్యాణ మండపం వద్ద ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. అనంతరం అంగన్‌ వాడీ కేంద్రంలో న్యూట్రిషన్‌ ఫుడ్‌స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.
పాలకొల్లు రూరల్‌ : దిగమర్రులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైసిపి పాలకొల్లు ఇన్‌ఛార్జి గుడాల గోపి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి గ్రామ సర్పంచి రాపాక నగేష్‌ కరుణాకర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి చిట్టూరి కనకలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు సునిబాబు, ఎంపిడిఒ పాల్గొన్నారు.