Oct 20,2023 23:36

తెనాలి : జాతీయ కీటక వాహన జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా దోమకాటు ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల తెనాలి పట్టణ పరిధిలో నిర్వహించిన ఫ్రైడే డ్రై డే అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ప్రారం భించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రారం భమైన ర్యాలీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని, జనావాసాల మధ్య నీటినిల్వలు లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా మలేరియా అధికారి టి.మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్‌ గునియా, మెదడువాపు వ్యాధులు వస్తాయన్నారు. ఫ్రైడే ని డ్రై డేగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్‌ఛార్జి చైర్మన్‌ ఎం.హరి ప్రసాద్‌, మున్సిపల్‌ ఆరోగ్యాధికారిణి డాక్టర్‌ కె.హెలెన్‌ నిర్మల, జిల్లా అసిస్టెంట్‌ మలేరియా అధికారి రాజు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.