ప్రజారోగ్య పరిరక్షణకు జగనన్న ఆరోగ్య సురక్ష
క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించండి : డిప్యూటీ సిఎం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం జెడ్పి సమావేశపు మందిరమైన వైఎస్‌ఆర్ సభావేదికలో జెడ్పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జెడ్పి సాధారణ సర్వసభ్య సమావేశానికి ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ శాస్త్రసాంకేతిక భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి వెంట చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఎంఎల్‌సి భరత్, చిత్తూరు, తంబళ్ళపల్లి ఎంఎల్‌ఏలు ఆరణి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకనాధ్‌రెడ్డి, జడ్పీ వైస్‌ఛైర్మన్ రమ్య, ధనుంజయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సిఎం మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని అందుకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్యచికిత్సలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఏరాష్ట్రం లోనూ ప్రజల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధచూపి వ్యాధి నిర్ధారణతో పాటు మందుల పంపిణీ జరగడం లేదని, ఇంతటి బహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతూ, వైద్య వత్తిని అభ్యసించి డాక్టర్లుగా ఉన్న వారికే మార్గదర్శకం చూపే విధంగా ఈ కార్యక్రమం గురించి వివరించడం జరుగుతున్నదన్నారు. నాడు- నేడు క్రింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లా గహనిర్మాణ పురోగతిలో ప్రథమ స్థానంలో ఉందని ఇది ఇలాగే కొనసాగిస్తామన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి అర్హులైన వారికి మంజూరు చేసి ఇంటి నిర్మాణాలు జరిగేలా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. జెడ్పి ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాలకు సంబంధించి జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా కలెక్టర్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగ నియామకాలను చేపట్టామని తెలిపారు. మండల పరిధిలో తాగునీటి కొరతను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ సహకారంతో పరిష్కరించడం జరిగిందన్నారు. వివిధ అభివద్ధి పథకాల కొరకు రెండు సంవత్సర కాలంలో దాదాపు రూ.70 కోట్లు మంజూరు చేసి 70 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంఎల్‌సి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గానికి మరి కొన్ని ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. సమావేశంలో తిరుపతి డిఆర్‌ఓ పెంచల కిషోర్, రాష్ట్ర జానపదకళల అభివద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ ఛైర్మన్ శైలజా రెడ్డి, పికె ఎం ఉడా చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులు- ఇరిగేషన్, పిఆర్, ఆర్ అండ్‌బి ఎస్‌ఈలు విజరు కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, హౌసింగ్ పీడీ పద్మనాభం, డిఆర్‌డిఏ, డ్వామా, మెప్మా, ఐసిడిఎస్ పిడిలు తులసి, గంగాభవానీ, రాధమ్మ, నాగశైలజా, వ్యవసాయ ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.










