
ప్రజాశక్తి -రాయచోటి : ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని జగనన్న సురక్ష ఆరోగ్య క్యాంపు శిబిరాల వద్ద ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి 'జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ'పై వైద్యాధికారులు, ఎంపిడిఒలు, తహశీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందిని అధికారులు కూడా క్యాంపుల నిర్వహణ బాగా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటి వద్దకే ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ శిబిరాలలో స్పె షలిస్ట్ డాక్టర్లు మెడికల్ అధికారులు బాగా భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సురక్ష శిబిరం ప్రారంభమైన వెం టనే ఒపిఎస్ ఎంట్రీని తప్పనిసరిగా చేయాలిని ఎంపిడిఒ మున్సిపల్ కమిషనర్ మెడికల్ అధికారుల లాగిన్‌లో సురక్ష క్యాంపు మొదలుపెట్టినట్లు ఉదయం 10 గంటల లోగా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. నమోదును సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు పూర్తి చేయాలని ఎంపిడిఒలు, తహశీల్దార్లు, మెడికల్ అధికారులు ఈ అంశాలపై ప్రధానంగా దష్టి కేంద్రీ కరించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటుకు రెండు రోజులు ముందు ఫ్రీ క్యాంప్ అవేర్నెస్ చేయాలని సదర్ వాలంటీర్ ద్వారా ఎస్‌ఎంఎస్ పంపాలి అన్నారు. విసిలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, డిసిహెచ్‌ఎస్ సుకుమార్, మెడికల్ అధికారి రియాజ్, జిఎస్‌డిడబ్ల్యుఎస్ మనోహరరాజు, సర్వే ఏడి జయరాజ్, సోషియల్ వెల్ఫేర్ అధికారి జాకీర్ హుస్సేన్, ఇరిగేషన్ అధికారి కష్ణ మూర్తి, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.