ప్రజాశక్తి- భవానీపురం
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక 42వ డివిజన్ హెచ్.బీ. కాలనీలో కోటి 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం టెలిఫోన్ కాలనీలో నూతనంగా నిర్మించబోతున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సంద్భంగా వెలంపల్లి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా టెలిఫోన్ కాలనీలో ఎప్పటినుండి వున్న పడివున్న రోడ్లకు ఈ రోజు శంకుస్థాపన చేసుకొని త్వరలోనే నూతన రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి, స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి, ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు యలకల చలపతిరావు, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురీ లావణ్య, ఎండి.ఇర్ఫాన్, గుడివాడ నరేంద్ర, బాపతి కోటిరెడ్డి పాల్గొన్నారు.










