సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిడిఒ గీతావాణి
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎంపిడిఒ గీతావాణి తెలిపారు. సోమవారం మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. సర్పంచి ఉచప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ గీతావాణి మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు వైద్యపరంగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని తెలిపారు. ఎంపిటిసిలు మౌల సాబ్, భాగ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి, వైద్యులు నీలోఫర్, ఇమ్రాన్, జుబెరీయ, మయూర్ కుమార్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఎంపిహెచ్‌ఒ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.










