Nov 10,2023 00:21

ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు రామకృష్ణ

మేడికొండూరు: మండలంలోని వెలవర్తిపాడులో గురువారం సాయంత్రం ప్రజారక్షణ భేరిపై అవగాహన కార్యక్రమం జరిగింది. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌ వద్ద ఎంబి స్టేడియం ఆవ రణలో ఉదయం 10 గంటలకు జరిగే బహిరంగ సభ కు ప్రజ లందరూ పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇమామ్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.