
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ ఎస్ వెంకటేష్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం పామిడి, అనంతపురం, రాప్తాడు, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి వరకు ఈ బస్సు యాత్ర సాగుతుందన్నారు. పుట్టపర్తికి ఈ యాత్ర రాత్రికి చేరుకొని ఇక్కడే నాయకులు బస చేస్తారన్నారు. 3వ తేదీన నల్లమాడ, కదిరి మీదుగా అన్నమయ్య జిల్లాలోకి ఈ బస్సు యాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఈ బస్సు యాత్రలో కేంద్ర, రాష్ట్ర, జిల్లాల సిపిఎం నాయకులు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం తదితర అనుబంధ సంస్థల నాయకులు పాల్గొంటారన్నారు, ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయవలసిన ఆవశ్యకత గురించి ఈ బస్సు యాత్ర సందర్భంగా నాయకులు వివరిస్తారన్నారు. ఆయా ప్రాంతాలలో జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పెనుకొండ : సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రమేష్ కోరారు. బస్సుయాత్రకు సంబందించిన కరపత్రాలను స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద విడుదల చేశారు. బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుంటుందని ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, నాయకులు తిప్పన్న , కిష్టప్ప , బాలు , భూ నిర్వాసితులు వెంకట్రామిరెడ్డి , నారాయణ , శ్రీరాములు, ప్రవీణ, గంగమ్మ , మంగమ్మ , గంగాధర్ , ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.