ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ అసమానతలు లేని అభివద్ధి కోసం విజయవాడలో సిపిఎం తలపెట్టిన బహిరంగ సభకు సామర్లకోట నుంచి బయలుదేరిన కార్యకర్తల వాహనాన్ని బుధవారం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కరణం ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలు, ప్రజా సమస్యలపై కాక వ్యక్తిగత దూషణలతో జరుగుతున్నాయన్నారు. ఇది ప్రజానీకానికి ఏ మాత్రం మంచిది కాదని, ప్రజా సమస్యలపై చర్చించాలని దాని కోసమే ప్రజా రక్షణ భేరి, ప్రజా ప్రణాళిక నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్యాస్ రూ.400కి ఇవ్వాలని, పెట్రోల్ రూ.60కి ఇవ్వాలని, విద్యుత్ యూనిట్ రూపాయికి ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లు వద్దని, తలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, 2 సెంట్ల ఇల్లు, రూ.5లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ పన్ను, తగ్గించాలని, ఇసుక ఉచితంగా ఇవ్వాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెన్షన్ రూ.5 వేలు ఇవ్వాలని, ప్యాసింజర్ రైళ్లు కొనసాగించాలని, ఎక్సప్రెస్‌లలో స్లీపర్ క్లాసులు పెంచాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆలోచన రద్దు చేయాలని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బాలం శ్రీనివాస్, కరణం గోవిందరాజు, నాయకులు నరవ సురేష్, చల్లా మహేష్, దారభాని కృష్ణ, ప్రజాసంఘాల నాయకులు, పి.ప్రసాద్, ఎం.బాబూరావు, ఎ.కనకారావు, కె.వీరబాబు, ఎన్.సత్యనారాయణ, ఫాతిమా, వరలక్ష్మి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.