
ప్రజాశక్తి - సాలూరు: సిపిఎం ఆధ్వర్యాన ఈనెల 31న పట్టణానికి చేరనున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు, సీదరపు అప్పారావు కోరారు. ఈ మేరకు ఆదివారం వారు ప్రజారక్షణ భేరి యాత్రకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి 31న జరుగబోయే సభలో ప్రసంగిస్తారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు. పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్‌లో జరగనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.వెంకటరావు వున్నారు.
సీతానగరం: సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణ యాత్ర జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్మునాయుడు ఒక ప్రకటనలో కోరారు. ఈ యాత్ర ఈనెల 31న సీతానగరం వస్తుందని, ఈ సందర్భంగా దీన్ని జయప్రదం చేయాలని కోరారు
పాచిపెంట : ఈనెల 31న సాలూరులో జరుగుతున్న సిపిఎం ప్రజారక్షణభేరి బస్సు యాత్ర సభలో సాలూరు పట్టణం, మండలం, పాచిపెంట మండల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు, ఎస్.అప్పలస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్వై నాయుడు తెలిపారు. బస్సు యాత్ర సభ జయప్రదానికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈతమానవలస, పాచిపెంట, కుడుమూరు తదితర పంచాయతీల్లో ప్రచారం నిర్వహించి, పోస్టర్‌ను విడుదల చేశారు.