
ప్రజాశక్తి - కురుపాం : సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆధ్వర్యాన గురువారం కురుపాం సంతలో ప్రచారం నిర్వహించారు. ముందుగా సిపిఎం ప్రజా ప్రణాళిక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారపు సంతలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు సొంత అజెండాల చుట్టూ తిరుగుతున్నాయని తెలిపారు. వీటిని ప్రజా సమస్యల చుట్టూ మళ్లించాలనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 30న ప్రజా రక్షణ బేరి బస్సుయాత్ర భాగంగా కురుపాంలో నిర్వహించే బహిరంగసభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోలక అవినాష్, కొల్లి గంగునాయుడు, ఎం.శ్రీనివాసరావు, కోరంగి సీతారాం తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సుయాత్ర విజయవంతానికి గురువారం జియ్యమ్మవలస మండలంలో ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రక్షణభేరి పోస్టర్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగునాయుడు విడుదల చేశారు. 30న కురుపాంలో నిర్వహించే సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజలంతా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోరంగ సీతారాం, నాయకులు భూతాల మోహనరావు, గరుగుబిల్లి శ్రీనివాసరావు, గరుగుబిల్లి రాజు, సామయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సాలూరు : ఈ నెల 31న పట్టణానికి వస్తున్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్రని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌వై నాయుడు కోరారు. యాత్ర గురించి పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రక్షణ భేరి యాత్ర 31న మధ్యాహ్నం 12 గంటలకు సాలూరు పట్టణానికి చేరుతుందని చెప్పారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు అర్జున్ పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలోని కోనవలస, డంగభద్ర గ్రామాల్లో సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యాన బస్సుయాత్రను విజయవంతం చేయాలని ప్రచారం చేశారు. సిపిఎం నాయకులు హెచ్.రామారావు, తదితరులు పాల్గొన్నారు.