
ప్రజాశక్తి-పామూరు: అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరితో నవంబర్ 15వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ పిలుపునిచ్చారు. పామూరు సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ముందుగా చలో విజయవాడ వాల్ పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన హామీలు రాజధాని శాఖ ఉక్కు కర్మాగారం పారిశ్రామికీరణ రాష్ట్రానికి ద్రోహం చేసిన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన వైఎస్‌ఆర్ పార్టీలు బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, ఈ విధానాలను స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధికై సిపిఎం పార్టీ ప్రజా ప్రణాళిక ద్వారా ప్రజల ముందుకు రాబోతుందని అన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి సిపిఎం ఒక దిశ నిర్దేశాన్ని ప్రకటిస్తుందని, దానికి రాష్ట్ర యావత్ ప్రజానీకం మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం సయ్యద్ గౌషా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్మాలపాటి మాల్యాద్రి, సీనియర్ నాయకులు షేక్ అల్లాభక్షు, షేక్ మీరావలి, కాశీం సాహెబ్, పి రామయ్య, షేక్ మస్తాన్, కే శంకర్, సిహెచ్ వెంకటేశ్వర్లు, వైవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.