
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 15న నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాలోని పలుప్రాంతాల్లో శనివారం ప్రచారం చేశారు. ఇందులో భాగంగా పెదకాకాని అంబేద్కర్ నగర్, పంచాయతీ ఎరియాల్లో నిర్వహించిన ప్రచారంలో సిపిఎం మండల కార్యదర్శి ఎన్.శివాజి మాట్లాడారు. కె.సత్యనారాయణ, ఎస్.నీలాంబరం, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇంటింటి ప్రచారంలో సిపిఎం శాఖ కార్యదర్శి యు.దుర్గారావు మాట్లాడారు. సిహెచ్.జనార్ధనరావు, జి.అజరు కుమార్, వి.రామారావు, సిహెచ్.గిరిధరరావు, డి.పద్మనాభశర్మ, బి.రాంబాబు, సిహెచ్.సీతారామాంజనేయులు, ఆనందం బాబ్జి, జి.కృష్ణ, జి.లక్ష్మి పాల్గొన్నారు. నీరుకొండలో కరపత్రాలతో ప్రచారం చేశారు. నాయకులు ఎం.భాగ్యరాజు, జి.నాగేశ్వరరావు మాట్లాడారు. మేడికొండూరు మండలం డోకిపర్రు, తురకపాలెం, మంగళగిరిపాడు గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేయడంతోపాటు పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు మండల కార్యదర్శి బి.రామకృష్ణ మాట్లాడారు. ఎస్‌కె.షరీఫ్, టి.రాజు, ఎం.వెంకటరావు పాల్గొన్నారు. తెనాలి పట్టణం చెంచుపేటలోని మస్టర్ పాయింట్ వద్ద కార్మికులతో సమావేశం నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్ మాట్లాడారు.