
చిలకలూరిపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రక్షణభేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్ర ఈ నెల 8వ తేదీన చిలకలూరిపేట రానున్న నేపథ్యంలో పట్టణములోని అన్ని వార్డుల్లో సోమవారం ప్రచారం నిర్వహించి, కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ సభను విజయవంతం చేయడానికి జరిగే ప్రచార యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, 8వ తేదీ ఉద యం తొమ్మిది గంటలకు కళామందిర్ సెంటర్ వద్ద బహి రంగ సభ జరుగుతుందని,ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి. కృష్ణయ్య, పల్నాడు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.విజయకుమార్,పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై. రాధాకృష్ణ పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఇదే సందర్భంగా ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం.విల్సన్ పి. శ్రీని వాసరావు పాల్గొన్నారు.