
ప్రజారక్షణ భేరి జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-మర్రిపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని కార్మికసంఘాలు సంఘటితంగా ఎదుర్కోవాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిఐటియు మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు శివప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరిలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి మూలి వెంగయ్య, సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, అధ్యక్షులు జీ.శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి దండు జాన్సన్, మధ్యాహ్న భోజన కార్మిక మండల కార్యదర్శి బి.రాములమ్మ, ఆశా వర్కర్ మండల కార్యదర్శి కామాక్షమ్మ, అధ్యక్షురాలు భారతి, సిపిఎం మండల కార్యదర్శి సయ్యద్ రంతుల్లా, అంగన్వాడీ సెక్టార్ కార్యదర్శి టి.లక్ష్మి, ఐద్వా మహిళా సంఘం మండల కార్యదర్శి గౌరవరం శామలమ్మ, అధ్యక్షురాలు మూలి ప్రమీల, కాశింబి, సిపిఎం సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్, సుధాకర్, సూర్యనారాయణ, రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.