ప్రజాశక్తి -హుకుంపేట: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ సమావేశం రభసగా మారింది. నిధులు లేక సర్వసభ సమావేశాలు ఎందుకని సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.ఎంపీటీసీలకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. సమస్యలను లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని అధికారులు చెప్పడంతో నిధుల్లేకుండా ఏమి పరిష్కరిస్తారని, ఇందుకు దరఖాస్తులు ఎందుకు ఇవ్వాలని ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా మండల సమావేశం నిర్వహించడం ఎందుకని టిడిపి, సీపీఎం, సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీ బహిష్కంచారు. దీంతో సభ్యులు లేక పోవడంతో సర్వసభ్య సమావేశం అధికారులు ముగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరావు, ఎంఈఓ ఎస్ రామచంద్రరావు, ఏటిడబ్ల్యువో రజిని, ఎంపీపీ కూడా రాజబాబు, జెడ్పిటిసి రేగం ముత్య్స లింగం, ట్రైబల్ వెల్ఫేర్ జెఇ ధ్రువ కుమార్, అధికారులు పాల్గొన్నారు.










